మా గురించి

అమర వీరుల స్మృతిలో – ఒక డిజిటల్ ప్రయత్నం

ఈ వెబ్‌సైట్ గురించి

ఈ వెబ్‌సైట్, హైదరాబాదు సంస్థాన విమోచన ఉద్యమంలో కరీంనగర్ ప్రాంతంలో పోరాడిన అమరజీవి అనభేరి ప్రభాకరరావు గారిని, ఆయన దళ సభ్యులను, మాందాపురం అమర వీరులను, ఆ ఉద్యమంలో పాల్గొన్న ఇతర విస్మృత వీరులను స్మరించుకోవడానికి, వారి గురించిన సమాచారాన్ని భద్రపరచడానికి ఏర్పాటు చేయబడింది.

ఇందులో ఏముంది

1. పుస్తకం వివరాలు – ప్రచురణకు సిద్ధమవుతున్న పుస్తకం గురించిన సమాచారం.

2. చందమామ పాట – కీ.శే. అనభేరి సరళాదేవి గారు 1948 లో రచించిన "అమరజీవి – అనభేరి" చందమామ (బతుకమ్మ) పాట పూర్తి పాఠం, ఉచిత PDF.

3. విజ్ఞప్తి – ఈ చారిత్రక సమాచార సేకరణలో సహకరించవలసిందిగా ప్రజలకు, బంధువులకు, పరిశోధకులకు విన్నపం.

4. సంప్రదించండి – మీకు తెలిసిన సమాచారం, ఫోటోలు, పత్రాల వివరాలు మాకు పంపడానికి.

చందమామ పాట

కీ.శే. అనభేరి సరళాదేవి గారి “అమరజీవి - అనభేరి” చందమామ పాటపై సవివర వ్యాసం “వాజ్మయి” త్రైమాసిక పత్రిక (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్) ఏప్రిల్–జూన్ 2008 సంచికలో (పే. 113–124) ప్రచురితమైంది. ఆ పాటను మాత్రమే అక్టోబర్ 2012 లో ఒక చిన్న పుస్తకంగా (booklet) ప్రచురించడం జరిగింది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ వెబ్‌సైట్‌లో ఉంచబడింది.

సేకరణ, రచన

డా. వెల్ముల కృష్ణారావు – ఇంటిపేర్ల పరిశోధకుడు, విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ (S.T.), నూజివీడు. రాజమండ్రి ఇంటిపేర్లపై పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి Ph.D. చేసారు. ఈ సేకరణ, డిజిటలైజేషన్ ఆయన కృషి.

ప్రచురణలో డా. తులా రాజేందర్ రావు గారు సహ రచయితగా సహకరిస్తున్నారు; పుస్తక ప్రచురణ వారి ట్రస్ట్ ద్వారా జరుగుతుందని తెలియజేయబడింది. ఇతరులు అందించిన వ్యాసాలు వారి వారి పేర్లతోనే ప్రచురించబడతాయి.

పుస్తకం (offline) మరియు ఈ వెబ్‌సైట్ రెండింటినీ జనవరి 2027 నాటికి తేవాలని సంకల్పం.

మీ సహకారం

మీకు తెలిసిన సమాచారం, ఫోటోలు, పత్రాల వివరాలు ఉంటే విజ్ఞప్తి పేజీ చూసి, సంప్రదించండి పేజీ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా పంపగలరు. సహకరించిన వారందరి పేర్లు తర్వాత ప్రకటించబడతాయి.

ONOMASTS℠ HERITAGE DIGITAL NEXUS

ఈ వెబ్‌సైట్ ONOMASTS℠ HERITAGE DIGITAL NEXUS వారి ఉత్పత్తి. తెలుగు భాష, ఇంటిపేర్లు, చరిత్ర, వారసత్వ సంపదను డిజిటల్ రూపంలో శాశ్వతంగా భద్రపరచడం దీని లక్ష్యం. Connecting the dots ....

ఫోన్: 9121006021, 7780733021 · ఇమెయిల్: info@anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com