పాదసూచికలు (సంపాదకుని గమనికలు)
సంపాదకుని సాధారణ గమనిక మాత్రా భంగమును నివారించుటకు / సరిదిద్దుటకు మాత్రమే మూలంలోని పదాలను గుణితములో కొంచెం మార్చడం జరిగింది. అలా మార్చిన చోట్ల, మార్చిన పదాన్ని ఈ పాదసూచికలలో చూపడమైంది. మిగతా చోట్ల, నేను గమనించి రాసిన వివరాలను కూడా ఇక్కడే ఇచ్చాను. – సంపాదకుడు
చరణం 17 ↑17మూల ప్రతిలోనే, పన్నెండు వరుసలు / చరణముల తర్వాతి వరుస / చరణమునకు 17 అంకె వేసి వుంది.
చరణం 27 ↑27ఇక్కడి "స" అక్షరం తలకట్టు మీద ఒక నిలువు గీత వున్నది. ఇలా వ్రాయడం వల్ల, ఈ "స" అక్షరాన్ని పొరపాటున "న" గా భావించకూడదని అప్పటి వ్రాయసగాళ్ల ఉద్దేశ్యం. ఇది అప్పటి తరం వారి లేఖన పద్ధతిని, జాగ్రత్తని సూచిస్తుంది.
చరణం 39 ↑39స్వాతంత్య్రం రాకముందు ఆయన ఆశించింది ప్రజల కష్టాలు తీరాలని. మరి ఆయన ఆశించిన ఆశయం ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా సిద్ధించిందా? మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లేనా?
చరణం 61 ↑61జన్మించినవారు.
చరణం 64 ↑64ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పై ఆనాటి కుటుంబ సభ్యులకున్న నమ్మకమది.
చరణం 69 ↑69సావనీర్‌లో శ్రీ దేశిని చినమల్లయ్య గారు వ్రాసిన "అనభేరి ప్రభాకర రావు త్యాగనిరతి" అనే వ్యాసం కూడా ఆయన రాత్రింబగళ్లు పనిచేసిన విషయాన్నే ధృవీకరిస్తున్నది.
చరణం 74 ↑74అభ్యంతరకరమైన తిట్టు పదం కావడంతో, దానిని వదిలి "(ఎడిట్)" అని సూచించడమైంది.
చరణం 92 ↑92రచయిత్రి ఈ పాటకు ఏ పేరు పెట్టిందో నాకు తెలియదు. ఈ పాటను ఆమె కొన్ని విడి కాగితాలపై వ్రాసింది. కావున మొదటి పేజీ కూడా ఉందో లేదో తెలియని పరిస్థితి. మా మేనత్త గారు "అమరజీవైనాడు" అనే పద ప్రయోగం చేయటం వల్లనే, నేను ఈ పాటకు "అమరజీవి – చందమామ పాట" అనే పేరును పెట్టడం జరిగింది.
చరణం 97 ↑97ఇవి పురాగాథ వర్ణనలుగా, అతిశయోక్తిగా కనిపించినా, ఆయన చనిపోయిన సమయం సాయంత్రం 5 గంటలు. కావున వాతావరణంలో అలాంటి మార్పులు సహజం. పైగా, ఆయన మరణం పీడిత, తాడిత ప్రజానీకానికి, సహచరులకు, కుటుంబసభ్యులకందరికీ దుఃఖకారణమే కదా! ఇలాంటి మరికొన్ని విషయాలను
“శ్రీమతి అనభేరి సరళాదేవి గారి చందమామ పాట – చారిత్రక, సామాజిక మరియు భాషా విశేషముల పరిశీలన”
అనే మరో వ్యాసంలో వివరంగా చర్చించాను. ఆ వ్యాసం చాలా పెద్దదిగా ఉన్నందున, పత్రికా సంపాదకుల సూచన మేరకు చాలా వరకు కుదించి,
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారి
“వాజ్మయి” ఏప్రిల్–జూన్ 2008 సంచిక (వాల్యూం 10, నం. 2) లో (పే. 113 నుండి 124 వరకు) ప్రచురించడం జరిగింది.
చరణాలు 105, 116 ↑105 ↑116ఇందుర్తిలో రంగారెడ్డి అనే ఆబ్కారి ముస్తాదారు అకృత్యాలకు విసిగిన ప్రభాకరరావు గారు అతన్ని చాలాసార్లు మందలించారు. చివరిసారిగా, ఊరి ప్రజలు చంపుమన్నా, రాళ్ళు కరుగగా ఏడ్చితే విడిచిపెట్టగా, ప్రభాకర్ గారు వెళ్ళగానే, స్వయంగా కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారమిచ్చి, ప్రభాకరరావు గారి చావుకు కారణమైనాడు. (సావనీర్‌లోని ముస్కు ఎల్లారెడ్డి గారి "నాటి అనుభవం" (పే. 27) మరియు మరికొందరి వ్యాసాలూ ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి.)
బాఖరుస్సేన్ మరియు షంషాద్ హుస్సేన్ అనేవారు ప్రభాకర రావు గారిని చంపించినట్లు తెలుస్తోంది.
“... ప్రభాకర రావు దళాన్ని చంపించిన బాఖరుస్సేన్ తాలూక్‌దార్, షంషాద్ హుస్సేన్ మోహతమీన్ పోలీసు గార్లు కూడా మాతో పాటు కరీంనగర్ జైల్లోనే నిర్బంధించబడ్డారు. ...”
– సావనీర్, పే. 5, "కరీంనగర్ ఉద్యమ చరిత్రలో అనభేరి" – కల్వకోట వెంకట దామోదర్ రావు (గుండి) గారి వ్యాసం.
ఆరోపములకు మూలం: సావనీర్ పే. 5, 27. చరణం 136 ↑136సంధి వల్ల "మా హస్తాంజలులు" అని ఉండాలి. కానీ అలా మారిస్తే లయ (నడక) దెబ్బ తింటుందని, మూలంలోని "మా హస్త అంజలులు" ను యథాతథంగా ఉంచడం జరిగింది. అలాగే "మాతృచే కొమ్ము" అని ఉన్న పదం "మాతచే"గా ఉంది.