విజ్ఞప్తి

మాందాపురం అమర వీరులపై సమాచారం కొరకు, సహకారం కొరకు

వివిధ పుస్తకాలను పరిశీలించి చేసిన విషయ సేకరణతో, కీ.శే.అనభేరి ప్రభాకరరావు గారిపై ఒక Monographను గతంలో నేను రాజమండ్రిలో వున్నప్పుడు కొంత వ్రాయడం జరిగింది. నా ఉద్యోగ విరమణ అయినందున, మరికొన్ని గ్రంథాలను పరిశీలించి, దీనిని నేను కొంత కాలం కింద పూర్తి చేసాను. అయితే, ఆయన అనుయాయులను, మిత్రులను, ముఖ్యంగా ఆనాటి సంఘటనలో పాల్గొన్న వారి వివరాలను కూడా చేర్చవలసిన అవసరాన్ని నేను తర్వాత గుర్తించాను. ఈ విషయంగా సంవత్సరం క్రితం డా. తులా రాజేందర్ రావు గారు తాను కూడా ఈ మహత్కర కార్యక్రమంలో సహకరిస్తానన్నారు. మరియొక సంతోషకరమైన విషయమేమంటే, ఈ పుస్తక ప్రచురణ కూడా వారి ట్రస్ట్ ద్వారా చేస్తానని అడుగకముందే ఆయనే మాట ఇచ్చారు. అందువల్ల, ఆయనను కూడా సహ రచయితగా చేర్చి, ముందుకు పోవడం జరుగుతున్నది.

ఈలోగా ప్రభాకరరావు గారి దగ్గరి బంధువులు, ఆయన గూర్చి విన్న/ తెలిసిన గౌ. చాడ వెంకట రెడ్డి వంటి వారు, మరియు మరికొందరు ఇతరులు కూడా తమ వ్యాసాలను అందించుటకు ఉత్సాహంగా ముందుకువచ్చారు. ఎవరు రాసిన వ్యాసాలు వారి పేరుననే పుస్తకంలో ప్రకటించడం జరుగుతుంది.

డా. తులా రాజేందర్ రావు, తులా మధుసూదన్ రావు, అన్నవరం దేవేందర్ గారితో పాటు వారి మిత్రుల సహకారంతో, ఆనాటి దళ సభ్యుల/ వారి వారసులు నివాసిస్తున్న (సోమారం, లక్ష్మీపురం, గాలిపెళ్ళి మొ.) కొన్ని గ్రామాలను సందర్శించడం (క్షేత్ర పర్యటన చేయడం) జరిగినది. సహకరించిన వారందరి పేర్లను తర్వాత ప్రకటించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ వద్ద ఏమైనా ఉంటే , దయచేసి నా వెబ్ మెయిల్ (info@anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com) కు పంపగలరని కోరి, ప్రార్థిస్తున్నాను.

ఇందులో అనభేరి సరళాదేవి గారి మిగతా రచనల వివరాలను కూడా చేర్చ బడతాయి. దీనిని పుస్తక రూపేణా (offline) మరియు వెబ్సైటు ద్వారా ఒకేసారి జనవరి, 2027 వరకు తేవాలని నా సంకల్పం. సామాన్య జనులకు కూడా అందుబాటుగా ఉండేందుకు https://anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com/ అనే నా website ద్వారా కూడా అశేష ప్రజాబాహుళ్యంలోకి తేవాలని నా ప్రయత్నం.

కీ.శే అనభేరి సరళా దేవి గారి “అమరజీవి - అనభేరి” చందమామ పాట అనే శీర్షికతో గతంలో ఒక వ్యాసాన్ని “వాజ్మయి” (త్రైమాససిక పత్రిక), పొ.శ్రీ.తె.వి.వి., హైదరాబాద్, ఏప్రిల్-జూన్, 2008, సంచిక (పే.113-124)లో ప్రచురించడం జరిగింది.

రాజమండ్రి ఇంటిపేర్లపై పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం, బొమ్మూరులో, నేను Ph.D చేస్తున్న కాలంలో, ఈ పాట లోని భాషా చారీ త్రిక, సామాజిక, సాహిత్య విషయాలు, వ్యక్తిత్వ చిత్రణ, పాత్రపోషణ, రసవిచారము, లేఖన విశేషములు వంటి అనేక విషయాలతో ఒక సవివర వ్యాసాన్ని నేను వ్రాయడం జరిగింది. స్థలాభావం వల్ల, ఆ వ్యాసాన్ని సంక్షిప్తపరిచి, వాజ్మయి పత్రికలో అప్పుడు ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత, ఆ పాటను మాత్రమే ఒక bookletగా అక్టోబర్, 2012లో ప్రచురించడం జరిగింది.

డా. వెల్ముల కృష్ణారావు, ఇంటిపేర్ల పరిశోధకుడు, విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ (S.T.), నూజివీడు. ఫోన్: 9121006021, 7780733021

✉ ఇమెయిల్ 📝 ఫారం ద్వారా పంపండి💬 WhatsApp పాట చదవండి