కీ.శే. అనభేరి సరళాదేవి గారి “అమరజీవి – అనభేరి” చందమామ పాట · బుక్‌లెట్ (2012)
కీ.శే. అనభేరి ప్రభాకరరావు గారు కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం, పోలంపల్లిలో 15-8-1910 నాడు జన్మించారు. ఈయన నిజాం నవాబు పాలన నుండి తెలంగాణ విముక్తికై రణభేరిని మ్రోగించాడు. అప్పుడు జరిగిన సాయుధపోరాటంలో, రజాకార్ల మరియు నిజాం మిలిటరీ పోలీసుల చేతిలో తన 13 మంది దళసహచరులతో పాటు, తేది 14-3-1948 నాడు, మాందాపురం గుట్టపై వీరమరణం పొందినాడు.
ఈయన కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమ సాయుధ దళనాయకుడు. ఆ సంఘటన తర్వాత, ఒక్క దళములో ఎక్కువ మందిని ఉంచకుండా, గెరిల్లా పోరాట పద్ధతిని అనుసరించేందుకు కారణమైంది.
"అమరజీవి" అనభేరి ప్రభాకరరావు గారి సతీమణి కీ.శే. అనభేరి సరళాదేవి గారు మా చిన్న (5వ) మేనత్త. ఆయన వీరమరణం తర్వాత, ఆయనపై 1948 లో ఈ చందమామ పాటను ఆమె రాసారు.
| సేకరణ & డి.టి.పి. | డా. వెల్ముల కృష్ణారావు, ఇంటిపేర్ల పరిశోధకుడు, విశ్రాంత డిప్యూటీ అసిస్టెంట్ కమీషనరు (S.T.) |
| ప్రచురణ | రాధామాధవజీవన్ (రా.మా.జీ.) స్మారక కేంద్రం, పోస్ట్ & గ్రామం: తిరుమలాపురం (P.D.), వయా & మం. గొల్లపెల్లి, జి. కరీంనగరం 505 532 |
| ప్రచురణ సంఖ్య | 2 |
| ప్రప్రథమ ముద్రణ | అక్టోబర్ 2012 |
| ప్రతులు | 1000 |
| వెల | అమూల్యం |
| ముద్రణ | ముగ్ధ ప్రింటింగ్ ప్రెస్, రాజమండ్రి |
| సంప్రదింపు | 9121006021, 7780733021 · info@anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com 📝 సమాచారం పంపే ఫారం |
| వెబ్‌సైట్ | anabheri-hisfollowers-forgottenchapters.onomasts.com |
1) ఈ చందమామ పాట మాత్రాఛందస్సుతో నడుస్తుంది. అక్షరజ్ఞానమున్నవారు ఎవరైనా సరే, వారందరూ చదవడానికి చాలా సులువుగా ఉన్నది. దీనిని ‘ఉయ్యాల’ వంటి పదాలతో కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా పాడుకోవడానికి అనుకూలంగా ఉంది.
2) వ్రాతప్రతిలోనే పన్నెండు వరుసలు (చరణములు), తర్వాతి చరణానికి పదిహేడు వేసి ఉంది. మాత్రా భంగమును నివారించుటకు / సరిదిద్దుటకు, మూలంలోని కొన్ని పదాలు గుణింతంలో మాత్రమే కొంచెం మార్చబడినవి. ఆ వివరాలు పాదసూచికలు లో ఉన్నాయి.
మనవి: కీ.శే. సరళాదేవి గారు వ్రాసిన వివిధ పద్యాలు, "అమరజీవి" అనభేరి ప్రభాకరరావు గారి మరణానంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన బుక్‌లెట్‌లోని వివరాలు, ఆయన గూర్చి వివిధ పుస్తకాల్లో పేర్కొన్న వివరాలు, ఆనాటి మరికొందరు అమరజీవుల విశేషాలను చేర్చి, మరో పుస్తకం రాబోతోంది. మీకు తెలిసిన వివరాలేమైనా ఉంటే దయచేసి పంపండి. – భవదీయుడు, వెల్ముల కృష్ణారావు, సంపాదకుడు<